Friday, November 9, 2012

ఆవేదనతో తల్లడిల్లుతున్నాం...

చంద్రబాబునాయుడు... జగనన్న సెల్‌ఫోన్ వాడుతున్నాడని, చంచల్‌గూడా జైలు తనకు గెస్ట్‌హౌస్ అని అసత్యప్రచారం చెయ్యడం కంటే... జగనన్నను కోర్టుకు వ్యాన్‌లో తీసుకెళ్ళారని, జగనన్న భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని మాట్లాడి ఉంటే బాబుసార్ మీద ప్రజల్లో కొంతైనా సానుభూతి పెరిగేది. అధికారపక్షంతో కుమ్మకై టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మేస్థితిలో లేరు. సంబంధమే లేని కేసులవల్ల జగనన్న అరెస్ట్ అయ్యారని ప్రజలు ఎప్పుడో గ్రహించారు. చంద్రబాబు పాదయాత్ర చేసినా, కాంగ్రెస్ అధిష్టానం మనరాష్ట్రం నుండి ఎక్కువమందిని క్యాబినేట్‌లోకి తీసుకొన్నా సొంత ఆలోచన కాదు. జగన్ మాట్లాడిన ఎన్నికల ఉపన్యాసం నుంచి పొందిన స్ఫూర్తి. జగన్‌ని ఎలా ఎదుర్కోవాలనే తప్ప ప్రజలకు ఏమి చెయ్యాలి, పార్టీని పటిష్టంగా ఎలా నిలబెట్టుకోవాలి? అని ఆలోచించే శక్తిని కాంగ్రెస్, టీడీపీలు కోల్పోయాయి. ఇంత సిన్సియర్‌గా పాకిస్థాన్ గురించి ఆలోచించి ఉంటే కాశ్మీర్ ప్రజలు ఎప్పుడో ప్రశాంతంగా నిద్రపోయేవారు. రాష్ట్రంలో పాలన పడకేసి మూడు సంవత్సరాలు దాటిపోయింది. ఒక బలమైన నాయకుణ్ణి సిఎం స్థానంలో చూడలేకపోయాం. రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత రాష్ట్రం అనాథగా మారుతుందని కలలో కూడా ఊహించలేదు. ఆడవాళ్ళు కూడా రోడ్డుమీదకి రావలసిన పరిస్థితి ఏర్పడింది. 

‘నన్ను ఒంటరిని చెయ్యాలనుకున్నారు. నేను ఒంటరిగానే వెళుతున్నాను’ అని జగనన్న అన్నప్పుడు చాలామంది మనసులు ఆవేదనతో తల్లడిల్లిపోయాయి. ప్రజలు ఆ క్షణాన్నే... ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఢిల్లీ పెద్దలు దిమ్మతిరిగేలా తీర్పునివ్వాలని నిర్ణయించుకున్నారు. సిఎం స్థానంలో జగనన్నను కళ్ళారా చూడాలని ఈ రాష్ట్ర ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. జగనన్న మా గ్రామానికి వచ్చినప్పుడు కులాలు లేవు, మతాలు లేవు. అందరిలో ఆకాశమంత ప్రేమ కనిపించింది. జగన్‌లో ఓ అవ్వ మనవడిని, ఓ తల్లి బిడ్డను, ఓ అక్క తమ్ముడిని, ఓ చెల్లి అన్నను చూసుకుని మాట్లాడుతుంటే జగనన్న మాలో ఒక్కడైపోయాడు. అప్పుడే అనుకున్నాను... పొంగిపొర్లుతున్న సముద్రాన్ని ఆపడం ఎంత అసాధ్యమో, జగనన్నను ప్రజలకు దూరం చెయ్యడమూ అంతే అసాధ్యమని, ప్రపంచచరిత్రలో ఏ నాయకుణ్ణీ ప్రజలు ఇంతలా అభిమానించి ఉండరేమో. అద్భుతం జరగబోయే సమయం ఎంతో దూరంలో లేదు. 
- ఆర్.వాణీరెడ్డి, అనంతరాజ్‌పేట, రైల్వేకోడూరు, వై.యస్.ఆర్.జిల్లా

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...