ప్రతి కుటుంబం తమ కుటుంబానికి పెద్దాయన అనుకున్న రాజశేఖరరెడ్డిగారు మన నుంచి దూరమయ్యారు. ఆ తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి గారిని సిఎంగా చూడాలని ప్రతి కుటుంబం కోరుకుంది. ఈ రోజు రాజన్న పథకాలు అమలు కావాలంటే జగనే సమర్థుడు అని ప్రతి కుటుంబం నమ్మింది కాబట్టే ఆయన ‘‘ఓదార్పుయాత్ర’’ చేస్తే ప్రతి కుటుంబం ఆదరించింది, అభిమానించింది, అక్కున చేర్చుకుంది. తమ ఇంటిలోని బిడ్డగా చూసుకుంది. అతి తక్కువ కాలంలో, అతి చిన్న వయసులో ఇంత ప్రజాదరణ కలిగిన నాయకుడు బహుశా ప్రపంచంలోనే ఒకే ఒక్కడు జగన్.
ఇదంతా గమనించిన ఎల్లో మీడియా, కాంగ్రెస్ కురువృద్ధులకు పూనకం వచ్చి ఊగిపోయారు. రాజకీయంగా తమకు పాడెకడతాడేమోనని భయపడి, జగన్‌ను రాజకీయంగా ఎదిరించలేక, కుట్రలు పన్ని, వ్యూహం రచించి, సిబిఐ అనే అస్త్రంతో జగన్‌ను జైలుపాలు చేశారు. జగన్‌ను నాలుగు గోడల మధ్య బంధించి పైశాచికానందం పొందుతున్నారు. కాని రాజకీయంగా మీకు పాడె కాదు, ఏకంగా సమాధి కట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని గుర్తించుకోండి. జగన్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు జగన్‌ని ప్రతి కుటుంబం ఒక మనమడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక బిడ్డగా చూసుకుంటోంది.
ఇప్పుడు కాదుకదా ఇంకో పది సంవత్సరాల తర్వాత ఎన్నికలొచ్చినా జగన్‌ని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కుట్రలు పన్ని జగన్‌ను బంధించి పైశాచికానందం పొందే నాయకులు, మీడియాలు కనుమరుగై పోయే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. దేవుని ఆశీర్వాదంతో, ప్రజల ఆశీస్సులతో జగన్ త్వరగా ప్రజల మధ్యకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
- భూమిరెడ్డి లక్ష్మిరెడ్డి, మార్కాపురం, ప్రకాశం జిల్లా

No comments:
Post a Comment