Friday, November 23, 2012

ప్రజలకే ఆయన జీవితం అంకితం


రాజన్న మరణంతో రాష్ర్టంలో అమావాస్య చీకటి అలముకున్నది. పెద్దాయన రాజ్యంలో ప్రజలు చాలా సురక్షితంగా, ఆనందంగా మరియు ఆరోగ్యంగా జీవించారు. కనీస అవసరాలు తిండి, నీరు, బట్ట, గృహానికి లోటు లేకుండా వైఎస్ పరిపాలించాడు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో బంగారం పండింది. రాజన్నరాజ్యంలో వరి ధాన్యం పండింది. గంగను భూమికి తెచ్చింది ఆనాటి భగీరధుడు. ఆ గంగను బీడు భూములకు, పంట చేలకు, తాగునీటి అవసరానికి ఇంటింటికి మరల్చింది మాత్రం నేటి రాజశేఖరుడు. అటువంటి మహాశయుని ప్రతిరూపమే జగనన్న... రాజన్న తర్వాత ప్రజల కష్టాలను స్వయంగా చూసి చలించిపోయాడు. పెద్దాయన మరణం తట్టుకోలేక అనేకమంది గుండెలు ఆగిపోయాయి. వారి కుటుంబాలను ఓదార్చటానికి, వారి కష్టాన్ని తీర్చటానికి ఓదార్పు యాత్ర మొదలుపెట్టాడు. 

నేనున్నాను అనే భావాన్ని ప్రజల్లో కలిగించాడు. దానికోసమే ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి వెళ్లాడు. వారు కూడా ఆయన్ని సొంత బిడ్డలా అక్కున చేర్చుకున్నారు. కాని రాష్ట్ర, దేశ చీకటి రాజకీయ శక్తులన్నీ కలిసి ఒక్కటయ్యాయి. జగన్‌కు వున్నటువంటి ప్రజాదరణను ఓర్వలేక చుట్టూ విషవలయం ఏర్పాటు చేశాయి. అయినా కాని వెనకడుగు వేయటం వైఎస్ కుటుంబ రక్తంలోనే లేదు కాబట్టి జగన్ వారందరినీ కాదని న్యాయబద్దంగా ప్రజలకే తన జీవితం అంకితం చేశాడు. కాబట్టే దుష్టనేతలు కొందరు జగన్ మీద బుదరచల్లటం మొదలుపెట్టారు. ఎన్నో కేసులు పెట్టారు. జగన్‌ను రాజకీయంగా అంతం చేయాలని ప్రధాన పార్టీలన్నీ ఏకమయ్యాయి. సీబీఐని ఒక పావులా వాడుకున్నాయి. అయినా రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపి జయకేతనం ఎగురవేసింది. 

ప్రజలు జగన్‌ను ఒక నిర్దోషిగా మాత్రమే చూశారు కాబట్టి వారు ఆయన్ను నమ్మారు. ఎన్ని మేఘాలు అడ్డువచ్చినా ఎంతకాలం అవి సూర్యుడ్ని ఆపగలవు? జగన్ కూడా అంతే. చీకటి మబ్బుల తెరలను చీల్చుకొని వచ్చే సూర్యుడిలా పద్మవ్యూహం నుండి బయటపడతాడు. మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పల్లె, గడప, మనిషి సంతోషంగా జీవించటం మొదలుపెడతారు. ఇప్పుడు మనందరి కర్తవ్యం ఒక్కటే. అన్న బాధ్యతలన్నిటిని తన భుజాలపై వేసుకుని, తల్లి విజయమ్మకు తోడుగా రాష్ర్టమంతా పాదయాత్ర చేస్తున్న షర్మిలాగారిని కూడా అదే ప్రేమతో ఆహ్వానిద్దాం. మరో ప్రజాప్రస్థానంలో మనం కూడా భాగస్వాములం అవుదాం. రాబోయే ఎన్నికల్లో జగనన్నను గెలిపించుకుని రాజన్న సువర్ణయుగాన్ని మరల తెచ్చుకుందాం...

- వరప్రవీణ్‌రాజ్, కూచింపూడి

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...