అచంచల ప్రజాభిమానం చూరగొన్న యువనేతకు
చంచల్‌గూడ చెర బాధ తప్పలేదు. లోకం బాధను తన బాధగా తలచి ఓదార్చ గలిగిన వ్యక్తిని చేజార్చుకున్న వ్యవస్థను జాలిగా చూస్తున్న జైలు గోడలు జరిగిన అన్యాయానికి ప్రత్యక్ష సాక్షులు ఎన్నో కుటుంబాలను పరామర్శించి చేయూతనిచ్చిన చేతులు చేసేది లేక నిశ్శబ్దంగా ఉన్నాయి. తనకూ ఓ కుటుంబం ఉందన్న నిత్యసత్యాన్ని నికృష్ట హృదయాలు కూడ తప్పక తెలుసుకుంటాయి. తెలుగునాట చెరిగిపోని పాదముద్రలున్న జననేత గుండెనుంచి పుట్టిన జగన్‌ని ఇంతకాలం చేతులు కట్టేసినవాళ్ళు తను బయటకొచ్చాక నిశ్చేష్టులు కాక తప్పదు. జగన్ అభినవ అభిమన్యుడు ఏ వ్యూహాలూ తనని ఎంతోకాలం ఆపలేవు. సుత్తి దెబ్బలు తిన్న ఇనుము పదునెక్కిన తీరుగా మెత్తని పులిని ముట్టుకుంటే ఫలితమెలా ఉంటుందో కాలమే చెబుతుంది. ఎందుకంటే, మనుషులు అశాశ్వతం కాలం నిరంతరం. తెలుగువారి గుండెల్లో ‘జగన్, జగన్!’ అనే పదం కాలమున్నంతకాలం నినదించే వినిపించే ఒక నాదం, ఒక నినాదం. - దేశం జగన్‌మోహన్‌రెడ్డి, శేరిలింగంపల్లి, హైదరాబాద్ |
Sunday, November 11, 2012
ఒక నాదం! ఒక నినాదం
Labels:
jagankosam
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment