Monday, November 26, 2012

కడలి కెరటం జగనన్న...

జగనన్నపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, రాజకీయంగా దెబ్బకొట్టాలని చూసినా అది ఎవరికీ సాధ్యం కాదు. సీబీఐ వెయ్యి చార్జిషీట్లు వేసినా సముద్రపు కెరటంలా జగనన్న దూసుకొస్తాడు. దివంగత మహానేత రైతు బాంధవుడు, పేదల ఆశాజ్యోతి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆయన మరణం తర్వాత కాంగ్రెస్ సర్కార్ తుంగలో తొక్కడాన్ని జీర్ణించుకోలేక, ఆ సంక్షేమపథకాలు కనుమరుగవ్వడం, వాటి ఫలితాలు అందక బడుగు, బలహీన, పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూడలేకనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ నుండి బయటికి వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్‌ను స్థాపించి రాష్ట్రంలో ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు జనంలోకి వెళ్లారు. 

తన ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలనే తపనతో పోరాడుతుంటే జగన్‌కు వస్తున్న జనాదరణను చూసి జీర్ణించుకోలేని కాంగ్రెస్, టీడీపీలు జతకట్టి ఒక పెద్ద కుట్రకు పాల్పడ్డాయి. జగన్ అక్రమాస్తులు సంపాదించాడంటూ కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై జగన్‌పై కక్షసాధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే పాలక పక్షం, ప్రతిపక్షం కలగలిసి జన నేత జగన్‌పై కుట్రలు చేస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న కుట్రలను ప్రజలు గమస్తూనే ఉన్నారు. సముద్రానికి చావుండవు... జగనన్నకు రాష్ట్రంలో తిరుగుండదు.

కరెంటు ఇవ్వాలంటూ కోరిన రైతులపై కాల్పులు జరిపించి తొమ్మిదే ళ్ళ పాటు రాష్ట్రాన్ని బకాసురుడిలా దోచుకుతిన్న చంద్రబాబుపై సీబీఐ ఎందుకు దర్యాప్తు జరిపించడం లేదు? దీన్ని బట్టి చూస్తే చాలు... కాంగ్రెస్, టీడీపీలు జగన్‌పై ఎన్ని కుట్రలు పన్నుతున్నారో జనానికే అర్థమవుతుంది. తండ్రి మరణించిన తర్వాత ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న జగన్‌ను జైల్లో పెట్టి ఆయన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లక్ష కాంగ్రెస్‌లు, లక్ష టీడీపీలు ఏకమై సీబీఐతో వెయ్యి చార్జీషీట్లు వేయించినా వెల్లువలా జగన్ బయటికొస్తాడు. జగన్మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాబోయే 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకురావడం ఖాయం.

- ఏనుగుల మహేందర్, ఇల్లంతకుంట, కరీంనగర్ జిల్లా

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...