Tuesday, November 13, 2012

మా నాయకుడు జగనన్న

నమస్తే చెల్లెమ్మా! నమస్తే అక్కయ్యా! అని గాలిలోకి చెయ్యి విసురుతూ, చిరునవ్వుతో అక్కచెల్లెళ్లను పలకరిస్తూ, అధికారాన్ని తెచ్చిపెట్టిన రాజన్న కుమారుడైన జగన్ అతికొద్దికాలంలోనే అందరికీ నాయకుడెలా అయ్యాడని ఆశ్చర్యపోతున్నారు.నాయకుడు... నాయకునికి ఉండే లక్షణాలు... ఒకరు ఇస్తే తీసుకొనేవి కావు, అరువుగా వచ్చేవి కావు. తనకు తానుగా ప్రజాభిమానం సంపాదించి ప్రజల్లో మంచి చేస్తాననే నమ్మకం కలిగించేవాడే నాయకుడు. ఆ నాయకుడే మా జగనన్న.

మా జగనన్న ఎవరికి అన్యాయం చేశాడు? ఎవరి ఆస్తిని తీసుకున్నాడు? ప్రజల తీర్పుతో దీనికి సమాధానం తెలుస్తుంది. అది ఎంతో దూరం లేదు. జగన్‌ను జైల్లో పెట్టి యాత్రలు చేసి గెలుస్తామని, అధికారం, కుర్చీ మాదేనని విర్రవీగిపోయే నాయకులకు అధికారం రాదు. ఎందుకంటే మీ దగ్గర నాయకత్వ లక్షణాలు లేవు. మీ మనసుల నిండా ద్వేషం, మోసం, కపటం, పగ, ఓర్వలేనితనం. 

కాబట్టి మీరు ఎన్ని కుతంత్రాలు, కుట్రలు చేసినా మా నాయకుడు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడు. మా అందరికీ దగ్గరై అందరి సమస్యలూ తీర్చి మంచి నాయకుడు అనిపించుకుంటాడు. సింహం కొంచెంసేపు గుహలో సేద తీరినప్పుడు జిత్తులమారి నక్కలు అడవంతా మాదే అంటాయి. సింహం బయటకు వచ్చినప్పుడు నక్కలు పారిపోతాయి. అందరిలో చిన్నవాడైన నీ మీద ఇన్ని కుట్రలు చేసి జైలుకు పంపిన వాళ్లకు ముందు ముందు అధోగతే. అన్నా! నీ కోసం కొన్ని కోట్లమంది జనం ఉన్నారు. జయం మనదే. నీ కోసం ఎదురు చూస్తున్నాం!
- వి.సందీప్, ముద్దనూ

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...