దేశం అభివృద్ధి దిశలో పయనిస్తున్నప్పటికీ మన రాష్ట్రం మాత్రం అధికార పార్టీ నిర్లక్ష్యం వల్ల దైనందిన సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వానికి మిత్రపక్షంగా మారిన ప్రధాన ప్రతిపక్షం... అవిశ్వాసం పెట్టకుండా, పట్టీపట్ట్టనట్లుగా ‘వస్తున్నా వస్తున్నా’ అంటూ సాగదీస్తూ చోద్యం చూస్తుంటే, కుమ్మక్కయ్యారనడానికి నిదర్శం ఏం చెప్పగలం? వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఇడుపులపాయ సమాధి సాక్షిగా... నీచ రాజకీయాలకు రాష్ట్ర ప్రజలు సమాధికట్టే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రజా తీర్పు ప్రజాసేవకు అంకితమైన రాజకీయనాయకులకు అద్దంపట్టే విధంగా ఉండబోతుంది. అందుకోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు.
- అరవ హరికృష్ణ, కపడిపాలెం, నెల్లూరు జిల్లా
No comments:
Post a Comment