Saturday, November 3, 2012

దేవుడున్నాడు - జగన్‌కు న్యాయం జరిగి తీరుతుంది

ప్రతిపక్షాలు, అధికారపక్షంలోని కొందరు ‘పెద్ద’ మనుషులు రాజశేఖరరెడ్డి అక్రమంగా సంపాదించాడని గగ్గోలు పెడుతున్నారు. కాని ఆయన ప్రజలపై ప్రేమ, శ్రద్ధ, నిబద్ధతతో, ప్రజాహిత కార్యక్రమాలతో సక్రమంగానే ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడని వాళ్ళకే తెలుసు. ఆ హృదయాలన్నీ జగన్ వెన్నంటే ఉన్నాయి. ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్న రాజశేఖరరెడ్డిగారి స్థానాన్ని ‘ఇందిరమ్మ బాట’గాని, ‘వస్తున్నా మీకోసం’ కానీ చెరిపివేయలేరు సరికదా కనీసం పక్కకు కూడా జరపలేరు. ఇక చంద్రబాబు తను చేసిన గొప్ప పరిపాలనను గుర్తు చేయడానికి ప్రజల దగ్గరకు వస్తున్నారట.

ఏమి గుర్తు చేస్తాడు?
బషీర్‌బాగ్ కాల్పులా! 2 రూ. కిలో బియ్యం రేటు పెంచిన వైనమా! తను చేస్తున్న విషయాలన్నీ చాలా మంచివని ‘మనసులో మాట’ పుస్తక రూపంలో దాన్ని బలపరచిన విషయమా!
పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నాడని ఎవరైనా దయతలచి ఓటు వేయాలనుకున్నా తన ప్రజాకంటక పరిపాలన గుర్తుచేసి, ఆ రాలే ఓట్లు కూడా రాలకుండా చేస్తున్నాడని క్యాడర్ బెంగపడిపోతోంది. ఇప్పుడు ఎన్నో చేస్తానని చెప్పినా ఈయన విశ్వసనీయతపై ప్రజలకు నమ్మకం పోయింది. ప్రజల గురించి తెలుసుకోవడానికి, ప్రజలతో మమేకం అవడానికి సినీ మెగా డెరైక్టర్ల శిక్షణ అవసరం లేదనుకుంటా. పాపం వారి డెరైక్షన్ ప్రకారం ఎంతో ఇష్టమైన తన విక్టరీ గుర్తు (రెండు వేళ్లు) వదిలేయాల్సి వచ్చింది.
ఎవరెన్ని చేసినా విశ్వసనీయతకు మారుపేరైన రాజశేఖరరెడ్డి వల్ల మేలుపొంది,ఆయన్ని గుండెల్లో పెట్టుకున్న ప్రజల అండతో భగవంతుని దయతో జగన్ బయటకు వస్తాడు. ఉన్నత పదవి అలంకరిస్తాడు. ఆంధ్ర ప్రజలకు సేవలందిస్తాడు. ఇది నిజం. దేవుడు జగన్‌ను దీవించుగాక.
- సుభాషిణి, నెల్లూరు

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...