సమకాలీన ప్రపంచంలో, మన దేశంలో జరిగిన దురదృష్టకరమైన, అనాగరికమైన, అన్యాయమైన, హేయమైన, దుర్మార్గమైన చర్యలలో ముఖ్యమైనది జగనన్నను వేధించడమే. ఇది ప్రజాస్వామ్యాన్ని హరించడమే అవుతుంది. జగనన్నను బందీ చేయడమంటే ప్రజలను వెర్రివారి కింద జమకట్టడమే అవుతుంది.
సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా బెయిల్ ఇవ్వకుండా నెలలు తరబడి జైలులో ఉంచడం ఏ చట్ట ప్రకారం సరైన విషయంగా చెల్లుబడి అవుతుందో ప్రజలకు అర్థం కాకుండా ఉంది. జగనన్నను జైల్లో ఉంచడానికి సీబీఐ వారు చెబుతున్న కారణం అర్థంలేనిది. ఆయన విచారణను ప్రభావితం చేస్తారట. కానీ కేసు నమోదయ్యాక సైతం ఆయన ఏడాది పాటు బయటే ఉన్నారే. అప్పుడే ఏమీ చేయని వ్యక్తి ఇప్పుడు ప్రభావితం చేస్తాడంటూ సీబీఐ వాదించడం పూర్తిగా అర్థరహితం.
ఆయనను అలా బందీ చేసి ఉంచితే ఆయన ప్రాభవం తగ్గుతుందని పాలకులు ఆలోచిస్తే అంతకంటే తెలివితక్కువతనం లేదు. ఆయనను జైల్లో ఉంచిన కొద్దీ ఆయనపై ప్రజాభిమానం ద్విగుణీకృతమవుతుంది. జగనన్నపైనా ఆయన కుటుంబ సభ్యుల పైనా సానుభూతి రెట్టింపు అవుతూనే ఉంటుంది.
- కారుమంతి ప్రసాద్‌కుమార్, గచ్చిబౌలి, హైదరాబాద్

Your articles are so hilarious. I read and enjoy them thoroughly. Keep posting..
ReplyDeleteThank you. pl. follow every day.
ReplyDelete