Sunday, November 25, 2012

ముమ్మాటికీ ఇది కక్షసాధింపే...

ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని సందేహం రావచ్చు. మృత్యుముఖ్యంలో ఉన్న కాంగ్రెస్‌ను తన పాదయాత్ర అనే సెలైన్‌తో బ్రతికించిన మన ప్రజానేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిగారు ప్రజానాయకుడిగా ప్రజల గుండెల్లో గూడుకట్టుకుని ఉన్నారు. అంతటి మహనీయ నేత కుటుంబానికి కాంగ్రెస్ పెద్దలు కృతజ్ఞత చూపిస్తున్న తీరు ఎంతైనా గర్హనీయం.
కనీసం తండ్రి వర్ధంతి రోజున సైతం ఆయన సమాధి వద్దకు వెళ్ళి నివాళి అర్పించడానికి వీలు లేకుండా, అవకాశం రాకుండా ఈ అధికార పార్టీ చేస్తున్న కుట్రలు చూస్తుంటే శకునిలాంటి వాళ్లు వీళ్ల ముందు దిగదుడుపే అనిపిస్తోందనడంలో ఏమాత్రం అనుమానం లేదు.

నాయకత్వం నెరపుతున్నవారందరూ నేతలే. కానీ కొందరే ప్రజానేతలుగా పేద ప్రజల హృదయాల్లో స్థానాన్ని పదిలపరచుకుంటారు. తన సంక్షేమ పథకాల ద్వారా దేవుడిలా అలా గూడుకట్టుకున్న మన రాజన్న కుటుంబం ఈ రోజున పడుతున్న మానసికక్షోభ తలచుకుంటే ఈ రాష్ట్రంలో రాజన్న ద్వారా లబ్ధిపొందిన ప్రతి మనిషీ బాధపడక తప్పదు.

డా. రాజశేఖర్‌రెడ్డిగారి సంక్షేమ పథకాలు ప్రతి నిమిషం ప్రజలకు ఏదో చేయాలన్న తపన చూసిన ఎవరైనా ఆయన అభిమానులు కాక తప్పదు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన, పర అనే బేధం లేకుండా ఆయన చేసిన సహాయాలు చూసిన వారికే అర్థమవుతుంది.

ప్రత్యర్థులు జగన్ పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేస్తుందన్న విషయం వీళ్లకు అర్థంకావడం లేదు. వీళ్లకు ఎటువంటి ప్రయోజనం ఉండదని వీరికి తెలీడం లేదా! ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నకొద్దీ జగన్‌గారిపై సానుభూతి పెరుగుతూ ఉందే తప్ప ఆయనకు ఎటువంటి నష్టం జరగడం లేదు. 

ఆయన జైల్లో ఉన్నా అఖండ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీయే కల్పిస్తుందని అనిపిస్తోంది. జగన్‌గారికి, ఆయన కుటుంబసభ్యులకు అధికార పార్టీ ఇస్తున్న మర్యాద, గౌరవం చూసి పైనుండి వైయస్‌గారి ఆత్మ ఘోషిస్తున్నదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

నిజంగానే అవినీతి జరిగిందని కోర్టు భావిస్తే అప్పటి క్యాబినెట్ నుంచి మొదలుపెట్టి మంత్రులందరిపైనా విచారణ జరిపించవచ్చుకదా! జగన్‌గారు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళినందుకు ఆయన ఒక్కరిపైనే ఇంత కక్ష సాధింపా? కాంగ్రెస్‌లో కంటిన్యూ అయ్యి ఉంటే జగన్‌గారు క్యాబినెట్ మంత్రి అయ్యిఉండే వారని వాళ్ళే చెప్పారు. అప్పుడు అవినీతి కనిపించి ఉండేది కాదా! చిన్న పిల్లాడికి కూడా అర్థం అయ్యే విధంగా, జగన్ గారిపై కక్ష సాధింపు కళ్లకు కట్టినట్లు కనిపిస్తూ ఉంది.

- శ్రీమతి దోనేపూడి పద్మలత కుమార్, మధురానగర్, తిరుపతి

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...