Tuesday, November 20, 2012

ఎంతకాలం ఈ వేదనలు...

మహానేత డా. రాజశేఖరరెడ్డి మా నుండి దూరమైనప్పటినుంచి రాష్ట్ర ప్రజలమైన మేము బాధపడని రోజు లేదు. నిశ్చేష్టులమైన మమ్మల్ని ఓదార్చడానికి రాష్ట్రమంతా తిరుగుతూ పల్లెపల్లెకు, వీధివీధికి తానే స్వయంగా వస్తున్న మా జగనన్నను చూసి హర్షించాం. గర్వించాం. ఇంతలోనే వినకూడని వార్త! మా జననేత అరెస్టు. గుండె పగిలిపోయింది... హృదయం కుమిలిపోయింది. ఇప్పటికీ కృశిస్తూనే వుంది. మేం కచ్చితంగా ఒకటి చెప్పదలచుకున్నాం... మా మహానేత ‘కోహినూర్ డైమండ్’. వైయస్సార్ ఉన్నప్పుడు కనీసం ఆయన కళ్లలోకి సూటిగా చూడడానికి కూడా భయపడే ఈ పాలక, ప్రతిపక్ష నాయకులు వైయస్సార్ దూరమయ్యాక మహానేతపై అనేక నిందలు మోపుతున్నారు. 

వీరికి తొత్తులుగా మారిన కొన్ని పత్రికలు వారిలో వున్న విషాన్నంతటినీ ఇప్పుడు కక్కుతున్నాయి. జగన్‌కు బెయిల్ రాకుండా ప్రతిరోజూ పత్రికల్లో అబద్ధపు ప్రచారాన్ని చేస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలమైన మా అందరి మదిలో మెదిలే ఒకేఒక్క అనుమానం... ‘న్యాయవ్యవస్థను వారి మీడియానే ప్రభావితం చేస్తుందేమో’నని! మరి అదే నిజమైతే న్యాయదేవత కళ్లు మూసుకుందా? ఇప్పటికైనా కళ్లు తెరిచి న్యాయం పక్షాన నిలుస్తుందా? ఇంకెంతకాలం ఈ వేదనలు?
- టి. నాగన్న, ముసలిమడుగు, కర్నూలు

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...