ఒక నిజమైన నాయకుడు నిరంతరం ప్రజాసమస్యలపై పోరాటం చేస్తాడు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాడు. తద్వారా ప్రభుత్వంలో కదలిక, ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తాడు. జగన్ ఇవన్నీ చేశాడు. ఇవన్నీ చేయడం ద్వారా ప్రజలకు నేనున్నానన్న భరోసా ఇచ్చాడు. ప్రజలు అతణ్ణి అక్కున చేర్చుకున్నాడు. ఇది ప్రభుత్వంలో ఉండే పెద్దలకు నచ్చలేదు. జగన్‌ని ఎలాగైనా సరే ప్రజలకు దూరం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వాల చేతిలో కీలుబొమ్మ లాంటి సంస్థ సి.బి.ఐ.ని ఎన్నుకొని దాని ద్వారా వేధిస్తున్నారు. ఎంతసేపు మీడియాను అడ్డం పెట్టుకొని అధికారం దక్కించుకోవాలనుకునే నాయకులకు ఇవాళ గుర్తింపు ఉన్నా రేపు ఉండదు. ప్రజల అండ ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలనుకునే నాయకుడే కలకాలం వారి హృదయాల్లో ఉంటాడు. చంద్రబాబును జనం పట్టించుకోకపోవడానికి కారణం అతడు మీడియా నాయకుడు. ప్రజా నాయకుడు కాడు. నీతీనిజాయితీ ఉన్న ఎవరైనా సరే ప్రత్యక్షంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసి అధికారం దక్కించుకుంటారు గానీ ఇలా మీడియా ద్వారా అధికారం కోసం గడ్డి తినరు.
పది నెలలు దర్యాప్తు చేస్తే ఒక్క చిన్న ఆధారం లభించని సి.బి.ఐ.కి ఇకముందు లభిస్తుంది అంటే అది హాస్యాస్పదమే. లక్ష కోట్ల అవినీతి అని పలికి ఇవాళ వేల నుండి వందల కోట్లకు ఆ లెక్క దిగజారిపోయినప్పుడే కాంగ్రెస్ పరువు, టి.డి.పి. పరువు అలాగే సి.బి.ఐ. పరువు దిగజారిపోయాయి.
ప్రజాభిమానం ఉన్న నాయకుణ్ణి మీరు తాత్కాలికంగా నాలుగు గోడల మధ్య బంధించగలరేమో కాని జన హృదయాల్లో నాయకుడిగా నిర్ణయమై గుండెల్లో గుడికట్టుకున్న జగనన్నను ఏ కుట్రలు కుతంత్రాలు, ఏ అప్రజాస్వామ్యక శక్తులు ఏమీ చేయలేవు. రాబోయేది ‘రాజన్న రాజ్యం’. అది జగనన్నతో సాధ్యం. భర్త జెయిల్‌లో ఉన్నా ధైర్యంగా ఉన్న భారతమ్మకు ప్రజల అండ ఉంది. విజయమ్మకు, షర్మిలమ్మకు లక్షలాది కుటుంబాల ఆదరణ ఉంది. జగన్ మావాడు. మన అందరివాడు. ఆయనే మన నాయకుడు.
- శ్రీనివాస శర్మ, రాజమండ్రి
No comments:
Post a Comment