
‘నిజం చెబితే నీ తల వెయ్యి వ్రక్కలవుతుందనే మునిశాపం ఉందో ఏమో మరి చంద్రబాబునాయుడు గోబెల్స్ ప్రచారం చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు. జగన్ సెల్‌ఫోన్ వాడుతున్నాడని, చంచల్‌గూడా జైల్ జగన్‌కు గెస్ట్‌హౌస్‌లాగ మారిందని, విజయమ్మగారు లాయర్లతో మాట్లాడడానికి ఢిల్లీ వెళితే కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యేందుకు ఢిల్లీ వెళ్ళారని చంద్రబాబు నానాయాగీ చేస్తున్నాడు. ‘చంద్రబాబు గారూ! మీరు చెబు తున్నది నిజమని ప్రమాణం చేయ గలరా!’ అని భారతమ్మ నిలదీస్తే ఉలుకూపలుకూ ఉండదు. పచ్చకామెర్లు వచ్చినవారికి లోక మంతా పచ్చగా కనిపించినట్లు ఉంది చంద్రబాబు తీరు.
ఆంధ్రుల ఆశాజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి ‘‘జనం కోసం జగన్- జగన్ కోసం జనం’’లాగ సాగుతుండడం కాంగ్రెస్, టీడీపీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జగన్‌ను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేమని గ్రహించిన కాంగ్రెస్, టీడీపీలు మ్యాచ్‌ఫిక్సింగ్ చీకటి రాజకీయాలు చేసి జగన్‌ను జైల్లో పెట్టారు. ఎంపీలను చిదంబరం దగ్గరకు పంపి జగన్‌కు బెయిల్ రాకుండా చేస్తున్నారు. వీరికి ప్రజలుగానీ, ప్రజాసమస్యలుగానీ పట్టవా! నీలం తుఫాన్ కారణంగా ఇళ్ళు కోల్పోయినవారికి ప్రభుత్వమే ఇళ్ళు ఇవ్వాలని, పంట నష్టపోయిన రైతులకు రబీసాగుకి సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందించాలని ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం చోద్యం చూస్తోంది.
- ఆదిరెడ్డి యానాదిరెడ్డి, శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా
No comments:
Post a Comment