Friday, November 9, 2012

విజయీభవ!



ఆనాడు... 
రాజన్న మరణంతో తెలుగువారు బాధాతప్తహృదయులైన వేళ
సమస్త జన కన్నీళ్లు తుడవాలని, కడగండ్లు తీర్చాలని 
రాజన్న బిడ్డ జగనన్న మనకోసం 
సుక్షేత్రాల సుక్షేమం కోసం, జన క్షేమ సంక్షేమం కోసం 
ప్రజాక్షేత్రంలో, కుటిలాత్ములు సంచరించే కురుక్షేత్రంలో 
పరుగాడుతూ, తిరుగాడుతు ఓదారుస్తుంటే - 
ఆధునిక కౌరవసంతతికి కడుపు మండింది, కన్నుకుట్టింది. 
ప్రజాహృదయ ప్రతిస్పందనకు 
అధికార పీఠం తలకిందులవుతుందని 
భయంతో కుట్రలు, కుత్సితాలు చేసి
వందలాది నేరారోపణలతో చెంచల్‌గూడ
పద్మవ్యూహంలో జగనన్నను బందీ చేశారు!

నేడు...
తెలుగునేలలో మొలిచిన కలుపు మొక్కలను
సమూలంగా పెకిలించడానికి 
హస్తినాపుర అధిష్టాన పునాదుల్లో 
ప్రకంపనలు పుట్టించడానికి 
అమ్మ విజయలక్ష్మి విజయభేరి మోగించింది, 
చెల్లి షర్మిలమ్మ శంఖం పూరించింది. మరో ప్రజా ప్రస్థానానికి కాలు కదిపింది. అడుగు వేసింది. నడక నడిచింది. 

ఢిల్లీ పేటకు బీటలు, ఢిల్లీ కోటకు కుదుపులు. 
అంతా భయభ్రాంతులయ్యారు, ముష్కరులంతా ఒక్కటయ్యారు.
శత్రుత్వాలను మరిచారు, అస్త్రాలు సంధించారు
కుళ్లు మనసులతో మహిళలపైనా ఆరోపణలు చేశారు. 
అయినా భయం లేదు... భయం లేదు... 
ఈ ప్రజాక్షేత్రంలో, ఆధునిక కురుక్షేత్రంలో 
ప్రజలే సైనికులై ఓటు అనే ఆయుధంతో 
హస్తినాపుర గాంధార సంతితిని 
మట్టికరిపించి ఓటమి పాలుచేస్తారు
జన హృదయ ఆరాధ్య యువనేత 
జగన్ననకు పట్టం కడుతారు 
ఆరోజెంతో దూరం లేదు. 
త్వరలో... అన్యాయం ఓడుతుంది... దర్మం గెలుస్తుంది.
చరిత్ర పునరావృతం అవుతుంది. కుట్ర కునారిల్లుతుంది. 
విజయీభవ! దిగ్విజయీభవ నినాదాలు మిన్నంటుతాయి. 

- విడదల సాంబశివరావు, పండరీపురం, చిలకలూరిపేట

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...