పేద, బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి... రైతు బాంధవుడు... రాజన్న రాజ్యం తేగల ఏకైక ప్రియతమ యువనాయకుడు వైయస్ జగన్ రాకకోసం ఈ రాష్ట్ర ప్రజలు తమ ఇష్టదైవాలను ప్రార్థిస్తూ, కోట్ల కళ్లతో ఎదురు చూస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి కడిగిన ఆణిముత్యం అని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్, టీడీపీల స్వార్థపూరిత కుట్రలను ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. జగన్ సంధించిన బాణం

షర్మిలమ్మ ‘మరో ప్రజాప్రస్థానం’ దెబ్బకు కాంగ్రెస్, టీడీపీలు గిలగిల కొట్టుకుంటున్నాయి. ప్రజలు షర్మిలమ్మ పాదయాత్రలో పాదం కలుపుతూ, కదం తొక్కుతూ, జన ప్రభంజనం లాగా సాగుతుండడం కాంగ్రెస్, టీడీపీ, ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది. తేలుకు తోకలో విషముంటుంది... పాముకు తలలో విషముంటుంది... ఎల్లోమీడియాకు నిలువెల్లా విషమే. ఆ విషాన్నంతా జగన్‌పై వెళ్లగక్కుతున్నాయి. చంద్రబాబు అయితే అర్థంపర్థం లేని, ఆధారం లేని అనుచిత వ్యాఖ్యలతో జగన్‌కు బెయిల్ రాకుండా చేయాలని మరో కుట్రకు తెరలేపుతున్నారు.
చంద్రబాబు గారికి భారతమ్మ రాసిన లేఖ సారాంశాన్ని గ్రహించి, విలువలు, విజ్ఞతకు కట్టుబడతారా లేక పాత పద్ధతినే అనుసరించి కుట్ర, వెన్నుపోటు ధోరణినే కొనసాగిస్తారా అని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ఆయన పాదయాత్ర అంతంత మాత్రంగా సాగడమే ఆయనకు ప్రస్తుతం ప్రజలు విధిస్తున్న శిక్ష. అసలైన శిక్ష ఎన్నికల్లో విధిస్తారు.
కుళ్లు, కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులతో నడిపే రాజకీయాలు ఎంతోకాలం నిలబడవు. అలాంటి రాజకీయాలు నడిపేవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. విలువలు, విశ్వసనీయతతో నడిచే రాజకీయాలే ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇది చరిత్ర చెబుతున్న అక్షరసత్యం.
- ఆదిరెడ్డి యానాదిరెడ్డి, శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా
No comments:
Post a Comment