తెలుగుదేశంపార్టీ నిజంగా ప్రజల కోసం పనిచేసే ప్రతిపక్షం కాదు. కేవలం
జగన్‌ని అన్నివిధాలా అణచివేయాలని చూసే అసూయాగ్రస్త విషవృక్షం. జగన్‌ని
జైలుకు పంపేవరకూ నిద్రపోలేదు. ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వలేదు.
న్యాయస్థానాల ద్వారా బయటకు వస్తాడేమోనని భయపడి, ఆయనకు బెయిలు దొరక్కుండా
ఉండడానికి నానా తంటాలూ పడింది. ఎన్నో నాటకాలు ఆడింది. చెరలోనైనా ఆయన
ప్రశాంతంగా ఉండడం వారికి ఇష్టం లేదు.
అందుకనే జగన్ జైలులో సెల్‌ఫోన్ వాడుతున్నారనే ఆరోపణతో కొత్త కుట్రకు తెరతీస్తున్నారు. తమకు కొమ్ము కాస్తున్న ఎల్లో మీడియా ద్వారా అదేపనిగా యాగీ చేస్తున్నారు. కొన్నాళ్లుపోతే జైల్లో జగన్‌కి అన్నం కూడా పెట్టొద్దని యనమల రామకృష్ణుడులాంటి ఘనులు గొడవ చేసినా చేస్తారు. టీడీిపీ వారికి జగన్ మీద, రాజశేఖరరెడ్డిగారి కుటుంబం మీద ఎందుకంత కక్ష? వారు చేసిన మహాపరాధమేమిటి? దివంగత మహానేత రాజశేఖరరెడ్డిగారు ప్రజాక్షేమం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం తన జీవితాన్ని ధారపొయ్యడమా? తండ్రి చూపిన బాటలో తనయుడు జగన్ అడుగులు వెయ్యడమా! ఉపఎన్నికల్లో పాలకపక్షాన్నీ, ప్రధానప్రక్షాన్నీ ఓడించడమా! జగన్ పట్ల, ఆయన కుటుంబం పట్ల ప్రజలు అపారమైన అభిమానాన్ని చూపించడమా? ఎవరెన్ని కుట్రలూ, కుతంత్రాలూ పన్నినా రాజశేఖరరెడ్డిగారి కుటుంబం మీద ప్రజలకున్న అభిమానం రాతిమీద గీతలాంటిదే గాని నీటి మీద రాతలాంటిది కాదు చెరిగిపోవడానికి, చెదిరిపోవడానికి...
- ఈదుపల్ల వెంకటేశ్వరరావు, ఏలూరు

No comments:
Post a Comment