కొన్ని వార్తా పత్రికల్లో మా సంస్థల గురించి ఏవేవో రాశారని సన్నిహితులు చెప్పారు. ఈ రోజు ఉదయం ఈనాడులో జగన్ బొమ్మవేసి బ్యానర్‌లో ‘‘కర్ణాటకలోనూ పోగేశారు’’ అనే కథనం రాశారు. జగన్, నేను కర్ణాటకలో భారీ ఎత్తున స్థిరాస్తులు సేకరించామని, సీబీఐ దర్యాప్తుకు హాజరైన సండూర్ పవర్ జీఎం గోపాల కృష్ణన్ మురళి తన వాంగ్మూలంలో వాటిని వెల్లడించారని అంటూ మాకున్న స్థలాలు, పొలాల వివరాలను ‘ఈనాడు’ రాసింది. ఈ రోజు ఈనాడు పెట్టిన శీర్షిక, రాసిన తీరు వరకు అంతా అభ్యంతరకరంగా ఉంది. మూడున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన పత్రిక జర్నలిజం విలువలకు పాతర వేసి ఇలా రాయటం ఎంతో విచారకరం!
ఆ వివరాలు చూసిన తరవాత నా భావాలను విజ్ఞులైన ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలనిపించింది. ఆ భావాల్లో మొట్టమొదటిది - ఈ వివరాలు జగన్ ఎన్నికల అఫిడవిట్ రూపంలోనో, మేము ప్రభుత్వ సంస్థ అయిన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలకో, ఆదాయ పన్ను రిటర్న్ ద్వారానో వెల్లడించినవే! మా దగ్గర ఆదాయానికి మించిన ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదు. మా ఆస్తులు ఏవైనా, చట్ట బద్ధ ఆదాయంతో, పన్నులు చెల్లించి మేం కొనుగోలు చేసిన ఆస్తులే. ఆ విషయాన్నే మా సంస్థల్లో ఉన్నత ఉద్యోగి అయిన మురళి సీబీఐకి చెప్పి ఉంటారు. విశేషం ఏమిటంటే... సీబీఐ అధికారి, మురళి మధ్య ప్రశ్నలు, జవాబులు ఏమిటన్నది వారిద్దరికీ తప్ప మూడో వ్యక్తికి తెలిసే అవకాశం లేదు, ఉండకూడదు. కానీ చట్టబద్ధమైన మా లావాదేవీలకు సంబంధించిన వివరాలను మా ఉద్యోగి సీబీఐకి చెబితే, ఆయన ఏం చెప్పాడన్నది ఈనాడుకు ఎలా తెలిసింది? ఈ ఒక్క సందర్భంలో మాత్రమే కాదు... దర్యాప్తు ప్రారంభించిన 2011 ఆగస్టు 10 నుంచి, ఈ రోజు వరకు ఇలా వందలకొద్దీ కథనాలు నేరుగా గిట్టని మీడియా సంస్థల చేతుల్లోకి ఎలా వస్తున్నాయి?
ముందుగానే చెప్పినట్టు మా వ్యాపారాలు, వ్యాపార లావాదేవీలు, ఆస్తులు... ఇవేవీ మేం ప్రజలకు కనిపించకుండా దాచుకోలేదు. ఇవి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్ ఓ సీ)కి మాకుగా మేం వెల్లడించినవి. ఇవి ఐటీ శాఖకో, ఎన్నికల సంఘానికో మేం సమర్పించిన వివరాల్లోనివి. ఇవి వివిధ సంవత్సరాల్లో మేం చేసిన కొనుగోళ్ళకు సంబంధించినవి. వీటికి సంబంధించి సీబీఐ ఎందుకు లీకులు ఇస్తోంది? ఎవరిని ప్రభావితం చేయటానికి, ఏం సాధించటానికి ఇంతకు దిగజారుతున్నారు? ఇంతకీ సీబీఐ ఈ దర్యాప్తును కొనసాగిస్తున్నది కోర్టు ఆదేశాలకు లోబడా? లేక ప్రజల్లో జగన్ ప్రతిష్టను తగ్గించాలన్న దురుద్దేశంతోనా? మేము కంపెనీలే రిజిస్టర్ చేయకూడదు, వ్యాపారాలే చేయ కూడదు, లాభాలు సంపాదించ కూడదు... మా కంపెనీల్లో పెట్టుబడులే పెట్టకూడదన్నట్టు కక్ష సాధింపుతో జరుగుతున్న వ్యవహారాన్ని దర్యాప్తు అంటారా? మాకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీలకు, పత్రికలకు తప్పుడు సమాచారాన్ని లీకులివ్వటం చట్ట బద్ధమా? అది నేరం కాదా? విజ్ఞులైన ప్రజలు దీన్ని గ్రహించాలి.
మాకున్న కంపెనీల్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారన్నదీ మేం దాచుకునే ప్రయత్నం చేయలేదు. ఏ కంపెనీ డబ్బుతో ఎక్కడ కొనుగోలు చేశామన్నది మాకుగా మేం ఆర్ ఓ సీకి సమర్పించాం. కాకపోతే దీన్ని ‘ఈనాడు’లో ‘పోగేయటం’గా రాశారు. గిట్టని మనుషులమీద ఈ స్థాయికి దిగజారి కథనాలు రాయటం ఏ జర్నలిజం ప్రమాణాలకు పట్టం కట్టటమో మీరే ఆలోచించాలి. గిట్టని వారిని ఆడిపోసుకోవటానికి, బెదిరించటానికి, అదిలించటానికి ధర్మ విరుద్ధమైన పనులకు జర్నలిజం అనే పేరు ఎలా అతుకుతుంది?
ఆస్తులను మా గ్రూపు సంస్థల ద్వారా కొన్నామని రాశారు. మా కంపెనీల ఆస్తులు మా కంపెనీల ద్వారా కాకుండా ఎవరి కంపెనీల ద్వారా కొంటాం? ఏ ఆస్తులను కొన్నా, వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగానే ఆ పని చేశాం. వ్యాపార విస్తరణ ద్వారా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టించాం. ఈ రోజున మా పెట్టుబడులున్న సంస్థలు కనీసం పాతికవేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాయన్నది అందరికీ తెలిసిన విషయం.
జగన్ తండ్రి, తాత ఏనాడో భారీగా వ్యాపారాలు చేసిన వ్యక్తులు. మూడు తరాలనుంచి మాది మైనింగ్, వ్యాపారం, పారిశ్రామికరంగాలతో ముడిపడిన కుటుంబం. ఈ రాష్ట్రంలో అత్యంత ఖరీదైన గనులకు 1970-80ల నాటికే వైఎస్ కుటుంబీకులు యజమానులు. అదీగాక, నాలుగయిదు తరాలుగా వైఎస్‌లది చంద్రబాబు, రామోజీలకు భిన్నంగా బిజినెస్‌లో ఉన్న కుటుంబం. రాజశేఖరరెడ్డిగారు అధికారంలోకి రాక మునుపే మా కుటుంబం బెంగుళూరులో మకాం ఉంది. అక్కడ వ్యాపారాలు ప్రారంభించింది.
మరో ముఖ్య విషయం ఏమిటంటే, జగన్ అటు వ్యాపారంలో ఉన్నా, ఇటు ప్రజా క్షేత్రంలో ఏ పని చేసినా త్రికరణ శుద్ధితతో చేసే మనస్తత్వం. అందుకే ఒక సాండూర్ పవర్, ఒక భారతి సిమెంట్, ఒక సాక్షి... ఇలా ఏదయినా అనతి కాలంలోనే కార్య రూపంలోకి వచ్చింది. నిర్మాణాలు, మెషినరీ, మార్కెట్‌లో వాటికి బ్రాండింగ్... అన్నీ జగన్ ఓ కమిట్‌మెంటుతో, విసుగూ విరామం లేకుండా పూర్తి చేశాడు. చేసే పనిలో క్వాలిటీ, ట్రాన్స్‌పెరెన్సీ ముఖ్యం అన్నది జగన్ నైజం. ఇందులో ఏ మాత్రం రాజీపడడు. అందుకే ప్రజలు ఆదరించారు. దేవుడు ఆశీర్వదించాడు. రాజకీయాల్లోనూ అంతే. ఒక్కసారి అంటూ నల్ల కాలువ దగ్గర మాట ఇచ్చి కదిలిన తరవాత, ఇక వెనుదిరిగి చూసే మనస్తత్వం లేదు. ప్రజలకు జగన్ కంపెనీలమీదగానీ, జగన్ పార్టీమీదగానీ ఆకాశమంత విశ్వాసం ఉందంటే అందుకు కారణం జగన్ వ్యక్తిత్వమే. ఈ వ్యక్తిత్వం వల్ల ఒకోసారి జగన్ బాగా కష్టపడిన సందర్భాలూ ఉన్నాయి. కానీ నమ్మిన బాటలో నడిచే ఎవ్వరూ నష్టపోరు. జగన్‌కు లొంగే మనస్తత్వమే ఉంటే, రాజీపడే ధోరణి అలవడి ఉంటే, విలువలన్నింటికీ తిలోదకాలు ఇచ్చి ఉంటే... ఏనాడో కేంద్రమంత్రో, ముఖ్యమంత్రో అయి ఉండేవాడు.
తాను ఎదగాలన్న ఆలోచన ఉన్న వ్యక్తుల్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఇతరుల్ని కిందికి లాగటమే జీవితంగా పెట్టుకున్న వ్యక్తులు ఏనాటికీ పైకి రారు. వారు బయట, బాహాటంగా తిరుగుతున్నా వారి ఆలోచనలన్నీ ఇతరుల్ని నాశనం చేయాలన్న ఆలోచనలతో నిండి ఉంటే అలాంటి వ్యక్తుల్ని సమాజం ఆమోదించదు. మరోవంక, వీరందరి కుట్రల ఫలితంగా జైల్లో ఉన్నా, ప్రజా సమస్యలమీద ఉద్యమించండి అంటూ జగన్ అక్కడినుంచే పార్టీ శ్రేణులను పరుగులు తీయిస్తున్నాడు. ఇతరులను ఎలా కిందికి లాగాలా అని ఆలోచించి విలువైన సమయాన్ని వృథా చేసుకునే మనస్తత్వం ఆయనకు లేదు.
జగన్‌ను అరెస్టు చేసి 168 రోజులయింది. సీబీఐ దర్యాప్తు ప్రారంభమై 15 నెలలు పూర్తయ్యాయి. ఈ దేశంలో రాజకీయ ఆరోపణల కారణంగా సీబీఐ దర్యాప్తు ప్రారంభమై ఒక రాజకీయ నాయకుడి ఇంటి మీద దాడులు చేయటంగానీ, అరెస్టు చేయటంగానీ ఏనాడూ జరగలేదు. అరెస్టు చేసిన 90 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలన్న నిబంధనకు దర్యాప్తు సంస్థ లోబడనట్టయితే బెయిల్ ఇవ్వాలని చట్టం చెపుతున్నా, ఈ రోజువరకు జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో ఆ నిబంధన వర్తించలేదు. ఇది అన్యాయం అని మాకు అనిపించినా న్యాయస్థానాలమీద, ప్రజాస్వామ్యంమీద మాకున్న గౌరవం సడలలేదు. అధికారం, ప్రతిపక్షం, మీడియాలో ఒక వర్గం... ఈ మూడింటి కుట్రలూ కుహకాలు ఏ స్థాయిలో ఉన్నాయో విన్నవించటానికి ఈ బహిరంగ లేఖను మీ ముందుంచుతున్నాను.
రాష్ట్రం, దాని ప్రయోజనాలు ఎటు పోయినా... ప్రజా నాయకుడిని ప్రజల్లో ఎదుర్కోలేక జైల్లో పెట్టి అధికార పక్షం, ప్రతిపక్షం నాయకులు జనంలో విశృంఖలంగా తిరుగుతున్నా... వారికి భరోసా లేదు. వైఎస్ అనే రెండక్షరాలు, జగన్ అనే మూడక్షరాలు చట్టాన్ని, రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించేలా దర్యాప్తు సంస్థల్ని, వాటి బాసుల్ని వక్ర మార్గాల్లో నడుపుతున్నాయి. వారు వేసే ప్రతి ఎత్తుగడ జగన్‌ను మరింత పెద్దవాణ్ణి చేస్తుంది. వారు చేసే ప్రతి కుట్ర జగన్‌ను ప్రజల గుండెలకు మరింత చేరువగా తీసుకువెళుతుంది. ఇది నా నమ్మకం మాత్రమే కాదు... గత మూడేళ్ళ చరిత్ర! దేవుడు న్యాయాన్ని, సత్యాన్ని బట్టి ప్రతి ఒక్కరికీ వారి క్రియా ఫలాన్ని ఇచ్చేవాడు కాబట్టి, వీరు వేసే ప్రతి నిందకూ దేవుడు రెట్టింపు ఘనతను జగన్‌కు చేకూరుస్తాడని నేను నమ్ముతున్నాను.

No comments:
Post a Comment