Friday, November 2, 2012

ఆ దుష్టచతుష్టయానికి బుద్ధిచెప్పే రోజు వస్తుంది...

మల్లెపూవు లాంటి తెల్లని పంచె కట్టుతో, అంతకంటే తెల్లటి చిరునవ్వుతో నిర్మలమైన మనస్సుతో ఒక ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అన్న భావన తెలుగువారైన ప్రతిఒక్కరి హృదయాలలో నాటుకుంది. అది ఎవ్వరో కాదు... ఆ మహానేత డాక్టర్ వైయస్సార్. ఆ మహానేత చేవెళ్ళ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు చేసిన ఆ మహాపాదయాత్రలో ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి బాధలు సమస్యలు చూసి అనారోగ్యవంతులుగా ఉన్న వాళ్ళని చూసి ఆ మహానేత మనస్సులో ఆరోగ్యశ్రీ పుట్టింది.

నిలువ నీడలేక చెట్లకింద, పుట్ల కింద పడుకున్న వాళ్లను చూసి ఇందిరమ్మ గృహ పథకం రూపుదిద్దుకుంది. డాక్టర్ వైయస్సార్ గారికి గాంధీల కుటుంబం పట్ల గౌరవంతో వారి పేర్లు పెట్టారు కాని అవన్నీ స్వతహాగా ఆయన మనస్సులోంచి వచ్చినవే. 108, 104 సేవలు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పావలా వడ్డీ రుణాలు ప్రవేశపెట్టారు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతోమంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పరిపాలించారు. మైనారిటీలను ఓటు బ్యాంకుగానే పరిగణించారు తప్ప మైనారిటీల అభివృద్ధికి ఎవరు సహకరించలేదు.

కానీ డాక్టర్ వైయస్సార్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 శాతం రిజర్వేషన్‌తో మైనారిటీల జీవితాల్లో వెలుగును నింపారు. ఆయన మరణంతో ఎక్కడి పథకాలు అక్కడే ఆగిపోయాయి. పథకాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచింది. తండ్రి మరణం తరువాత నేనున్నాను మీకోసం అంటూ రాజశేఖర్‌రెడ్డి గారి ఆశయాలకు ప్రతిరూపం జగన్‌గారు ఓదార్పు యాత్ర చేపట్టారు. కాని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, టీడీపీలు ఒక దుష్టచతుష్టయంగా ఏర్పడి ఒక మహాకుట్ర చేసి జగన్‌గారిని జైలుకు పంపారు. జగన్‌గారిని జైలుకు పంపడం ద్వారా డాక్టర్ వైయస్సార్ శ్రేణులు మానసిక ధైర్యాన్ని దెబ్బకొట్టాము అని సంబరపడుతున్న వాళ్ళకు ఒక్కటే చెప్పదలచుకున్నాము, మీరు ఎంతగా మమ్మల్ని వేధించినా రోజురోజుకు బలపడుతున్నామే తప్ప బలహీనపడటం లేదు.

జగన్‌గారు బయటకు వచ్చేరోజు వస్తుంది. ఆరోజు కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. జగన్‌గారి నాయకత్వంలో విజయమ్మగారి సారధ్యంలో పార్టీని ఇంకా బలోపేతం చేస్తూ జగన్‌గారిని ముఖ్యమంత్రిగా చేసేవరకు మేమంతా శాయశక్తులా కృషి చేస్తామని గట్టిగా చెబుతున్నాం. ఇప్పుడు తాత్కాలిక విజయం అవతలి వారిదైనా శాశ్వత విజయం మాదే అవుతుంది.
- శ్రీమతి జరీనా సుల్తానా, చిలకలూరిపేట

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...