దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుండి ఈ రాష్ట్రానికి దురదృష్టం పట్టుకుంది. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆశయాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది. తన రెక్కలు కష్టంతో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చిన వ్యక్తి వైయస్‌ఆర్. అలాంటి నేతను అక్రమంగా సంపాదించారంటూ కొందరు కాంగ్రెస్ ఆరోపణలు చేశారు. ఆ పెద్దలు ప్రతి పక్షాలతో కుమ్మక్కై ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదయ్యేలా చేశారు. తన తండ్రి చనిపోయినప్పుడు మనస్తాపం చెంది మరణించినవారి కుటుంబాలను ఓదార్చాలని ఇచ్చిన మాటకు కట్టుబడి పల్లెపల్లె తిరుగుతూ ‘‘నేను ఉన్నాను’’ అంటూ చనిపోయిన కుటుంబాలు ఓదార్చాడు జగన్. ప్రజాసమస్యలపై పోరాటాలు, దీక్షలు చేస్తూ ఉంటే జగన్ మరింత ప్రజలకు చేరువయ్యాడు.
ఇది తట్టుకోలేని పాలకపక్షం, ప్రతిపక్షం, కొన్ని మీడియా సంస్థలు కుమ్మక్కై సీబీఐ అనే ఒక మంత్రదండాన్ని చేతిలోకి తీసుకుని జగన్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. ఒక పక్కన కరెంటు మోతలు, మరోపక్కన వంటగ్యాస్ మంట దానికి తోడు పెట్రోలు వాత ఇంకా నీలం తుఫాను దాటికి గురైన వరి పంట నష్టం వంటి బాధలతో ప్రజలు, రైతులు సతమతమవుతున్నారు. రాష్ట్రానికి సేవ చెయ్యవలసిన సీఎం ‘ముందుంది మంచికాలం’ అంటూ ఢిల్లీ పెద్దలకు సేవలు చేస్తున్నాడు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదియ్యవలసిన వ్యక్తి అదే ప్రభుత్వంతో కుమ్మక్కై మీడియాను అడ్డం పెట్టుకుని ‘వస్తున్నా మీకోసం’ అంటూ పాదయాత్ర చేస్తున్నాడు. కాని ప్రజలకు కష్టాలు తీరేరోజు త్వరలో రానుంది. దేవుడు జగన్‌వైపే ఉన్నాడు. రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం. ఇది జగమెరిగిన సత్యం. జగన్ అన్న అతి త్వరలో బయటకు వస్తాడు. వైయస్‌ఆర్ కుటుంబానికి అండగా మేము ఉంటాం. జనం కోసం జగన్. జగన్ కోసం జనం అంటూ జన నేత కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నాం.
జననేత కోసం వెయ్యికళ్ళతో.....
- జి.కృష్ణంనాయుడు, గంపవానిపాలెం(గ్రా), విశాఖజిల్లా

No comments:
Post a Comment