నా పేరు రమ. మాది తూర్పుగోదావరి జిల్లా. నేను ఒక స్టూడెంట్‌ని. నాకు రాజకీయాల మీద సరైన అవగాహన లేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న విషయాల్ని చూస్తున్నా, పేపర్లో చదువుతున్నా నాకో విషయం సరిగా అర్థమవుతోంది... ఇదంతా కక్షా రాజకీయం అని.
దివంగత డా.వైయస్‌రాజశేఖరరెడ్డి గారు తెచ్చిన ప్రభుత్వం వారికి కావాలి, ఆ పదవులు కావాలి, కానీ వారి కుమారుడు మాత్రం అధికారంలోకి రాకూడదు. ఇది చాలా అమానుషం. అనైతికం. అలాంటి నాయకుణ్ణి జైలులో పెట్టిన ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఏమైనా చేసిందా? దానికి ప్రజల సమస్యలను తీర్చడానికి తీరిక లేదు. ఒకరి మీద ఒకరికి బురద చల్లుకోవడానికి మాత్రం చాలా తీరిక వుంది. నల్లడబ్బుతో చిక్కినవారూ లిక్కర్ సామ్రాజ్యాలు ఏలుతున్నవారూ పదవులు అలంకరిస్తూ ఉంటే వారికి వంతపాడే కొన్ని మీడియా సంస్థలు... వీటిని చూస్తుంటే ఏ విలువలకీ ప్రస్థానం అనిపిస్తోంది.
ఒకపక్కన కరెంటు మోత, మరోపక్క వంటగ్యాస్ మంట. దానికితోడు పెట్రో వాత... వీటిని ప్రజలు ఎలా భరించాలి? అన్నం పెట్టే రైతుకే తిండి లేకుండా చేశారు. ఎరువుల రేట్లకి రెక్కలు వస్తున్నా నియంత్రించలేదు కానీ ధాన్యం బస్తా రేటు పెంచడానికి మాత్రం నానాతిప్పలు పడుతోంది ప్రభుత్వం. ఈ కష్టాలన్నీ తీరే రోజు వస్తుంది. రాజన్న రాజ్యం వస్తుంది. రైతన్నకు మంచికాలం వస్తుంది. పంటపొలాలే దేశానికి పట్టుగొమ్మలు అనేరోజు తప్పక వస్తుందని ఆశిస్తున్నాను.
- రమ, వెలగతోడు, తూ.గో. జిల్లా

No comments:
Post a Comment