వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన
సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్ర గురువారం అనంతపురం జిల్లాలో పూర్తయి..
కర్నూలు జిల్లాలోకి ప్రవేశించనుంది. పత్తికొండ నియోజకవర్గం మద్దికెర గ్రామం
వద్ద కర్నూలు జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తుందని పాదయాత్ర సమన్వయకర్తలు
తలశిల రఘురామ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి మంగళవారం
కొనకొండ్లలో తెలిపారు. కర్నూలు జిల్లాలో 8 నియోజకవర్గాల్లో 15 రోజులపాటు
200 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు.
No comments:
Post a Comment