Wednesday, November 7, 2012

బియ్యం రూ. 12 పెట్టి కొనాలి..

బుధవారం పాదయాత్రలో భాగంగా గుంతకల్లు పట్టణంలో షర్మిల నడుస్తుండగా మహిళలు షర్మిలకు ఎదురేగి తమ సమస్యలు విన్నవించుకున్నారు. వారి మధ్య సంభాషణ సాగిందిలా..
మహిళ: మాబోటి వాళ్లు ఎలా బతకాలమ్మా.. అన్ని ధరలూ పెరిగాయి. అధికారంలో ఉన్న వాళ్లని మేం తగ్గించాలని అడగడం లేదు. కానీ వాటిని పెంచేముందు ఒక్క క్షణం బీదోళ్లు ఎలా బతుకుతారని ఆలోచించాలి.


షర్మిల: కరెంటు ఉంటుందా?
కరెంట్ ఉండదు.. బిల్లయితే ఎక్కువగానే వస్తోంది. 
ఎన్ని సిలిండర్లు వాడుతారమ్మా మీరు..
మనుషులను బట్టి వాడకం ఉంటుంది. మాకు రెండు నెలలకు ఒకటి పడుతుంది. ఇప్పుడు ఆరే ఇస్తామంటున్నారు. అంతకంటే ఎక్కువ అవసరమైతే రూ. 900 పడొచ్చని అంటున్నారు.

రాజన్న ఉన్నప్పుడు ఎలా ఉంది గ్యాస్ పరిస్థితి?
అప్పుడు గ్యాస్ ధర పెరగలేదమ్మా. ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్లు మళ్లీ ఓట్లప్పుడు గానీ మా ముందుకు రారు. మీరొక్కరే మా వరకూ వచ్చారు. కనీ సం మాకు మంచినీళ్లు కూడా దొరకవు.

బియ్యం సరఫరా ఎలా ఉంది?
మరో మహిళ : మనిషికి నాలుగు కిలోలే ఇస్తున్నారు. అవి ఏమాత్రం? ఈ బియ్యం ఒక్క రూపాయికి కిలో అంటున్నారు. కానీ అవి అయిపోగానే మళ్లీ బియ్యం కొనాలంటే బయట రూ. 12 పెట్టి కొనాలి. మూడు పూటలా తినే పరిస్థితి లేదు.

ఇప్పుడు ఎవరి ప్రభుత్వం ఉంది?
కాంగ్రెస్ ప్రభుత్వం 
అంటే రాజన్నది కాదు 
కాదు మేడమ్

మీకు అర్థమవుతోందా చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేదో, రాజన్న ఉన్నప్పుడు ఎలా ఉండేదో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా ఉందో! రాజన్న చేసిన పనులన్నీ మళ్లీ ఆయన కొడుకుగా జగనన్న చేస్తాడు. మళ్లీ మంచిరోజులొస్తాయమ్మా.. ధైర్యంగా ఉండు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...