రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సమస్యల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆకాశాన్నంటుతున్న ధరలు, ఊహించని స్థాయిలో కరెంటు కోతలు రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్నాయి. ఎవరెన్ని కబుర్లు చెప్పినా, కల్లబొల్లి వాగ్దానాలు చేసినా తెలుగు ప్రజలు వినే స్థితిలో లేరు. కిరాయికి ఉండే కుటుంబాలు కరెంటు బిల్లులతో బెంబేలెత్తుతున్నాయి. రాజన్న లేకుంటే ఇంతలోనే ఎంత మార్పు! రాష్ట్ర సమగ్రాభివృద్ధినీ, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విలక్షణ పథకాలను రూపొందించి రాజన్న విజయవంతంగా అమలు చేసి అభివృద్ధి పథాన రాష్ట్రాన్ని నడిపించిన ఘనత దివంగత నేత ముఖ్యమంత్రి మన రాజన్నదేనన్న విషయం నిరాకరించలేని వాస్తవం. రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జలయజ్ఞానికి గాను మన రాజన్న... అన్ని రాజకీయ వర్గాలకు అతీతంగా, జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల నేతల నుంచి ప్రశంసలను అందుకున్నారు. అందుకే రెండోసారి రాజన్న కాంగ్రెస్ పార్టీకి పట్టం గట్టారు.
రాజన్న అకాల మరణంతో అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ప్రజల సంక్షేమం గాలికి కొట్టుకుపోయింది. అభివృద్ధి కుంటుపడి విద్యుత్ కోతలతో పరిశ్రమలు కూడా మూతకు గురవుతున్నాయి. చిరునవ్వు నవ్వుతూ అందరితో కలుపుగోలుగా మాట్లాడే వ్యక్తి మన రాజన్న. ఆయన నవ్వులు రాష్ట్రంలోని ప్రతివారి పెదవులపై విరజిమ్మాలంటే ఆ రాజన్న పాలన జగనన్న ద్వారా మళ్ళీ రావాలని, అది కలకాలం నిలవాలని మనసా వాచా కోరుకుంటున్నారు. ఆ మంచి కాలం ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో అందరూ ఎదురుచూస్తున్నారు.
- కందికట్ల సదానందం, సిరిసిల్ల, కరీంనగర్
No comments:
Post a Comment