Wednesday, November 7, 2012

నమ్మేందుకు సిద్ధంగా లేము

దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజల సమస్యల మీద పోరాడవలసిన ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వంతో కుమ్మక్కై జగనన్నను రాజకీయంగా అణగదొక్కడమే లక్ష్యంగా, వైయస్‌ఆర్‌సిపిని ఓడించడమే పరమావధిగా ఎన్ని కుట్ర లు పన్నినా ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఉపఎన్నికలలో జగనన్నను అఖండ మెజార్టీతో గెలిపించారు. రాజశేఖర్‌రెడ్డిగారిని అభిమానించే ప్రతి హృద యం జగనన్నకు అండగా ఉందని నిరూపించారు. తరువాత చంద్రబాబు అక్రమ ఆస్థుల మీద సిబిఐ విచారణ జరిపించాలని విజయమ్మ పిటిషన్ వేస్తే కనీసం దాన్ని బెంచ్ మీదకు కూడా రాకుండా చంద్రబాబు మేనేజ్ చేశాడు. 

జగన్ మీద శంకర్‌రావు లేఖ రాయగానే సిబిఐ ఆగమేఘాల మీద దాడులు ప్రారంభించి, చంద్రబాబు విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించిందంటే ఏమనాలి? చంద్రబాబుకు హైకమాండ్ అండదండలు దండిగా ఉన్నాయనుకోవాలా? జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినందుకే కక్ష కట్టిందనాలా? ఉప ఎన్నికల ప్రచారంలో గులాంనబీ ఆజాద్ జగన్ కాంగ్రెస్‌లో ఉండి ఉంటే మొదట కేంద్రమంత్రి పదవిచ్చి ఉండేవాళ్ళం అన్నారు. కెవిపి రామచంద్రరావు గారి మనసులో ఏముందోగానీ రాజశేఖర్‌రెడ్డిగారిని అవినీతిపరుడన్నా, రాష్ట్రాన్ని దోచి జగన్‌కు పెట్టాడన్నా, సిబిఐ చార్జీషీట్‌లో వైయస్‌పేరును చేర్చినా స్పందించకుండా వైయస్ పుస్కకావిష్కరణ కార్యక్రమాన్ని ఢిల్లీలో హడావుడిగా నిర్వహించారు. దానికి కాంగ్రెస్ పెద్దలందరూ హాజరయ్యారు. ఎవరిని మభ్యపెట్టడానికి ఇటువంటి కార్యక్రమాలు చేయడం? మహానేత మరణించినప్పటి నుంచి, ‘రాజశేఖర్‌రెడ్డి మా వాడు కాదు, అవినీతిపరుడు’ అని చూశారు. 

కాని ఫలితం కనిపించకపోయేసరికి ప్లేటు మార్చారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఏవిధమైన దిద్దుబాటు చర్యలు చేపట్టినా ఓటర్లను ఎంత ప్రలోభపెట్టాలని ప్రయత్నించినా రాష్ట్ర ప్రజలు అంత అమాయకులు కారు. అధికార, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం చేసినా కొన్ని పత్రికలు, టీవీ ఛానెళ్ళు పచ్చరాతలు ప్రచారం చేసినా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఏది మంచో ఏది చెడో స్వయంగా గమనిస్తున్నారు. ఇప్పటికైనా అధికార, ప్రతిపక్షాలు, సిబిఐ, ఎల్లో మీడియా... జగన్ మీద, జగన్ కుటుంబం మీద, కుట్రలు, కుతంత్రాలను ఆపితే ప్రజలు క్షమిస్తారు. జగనన్నలాంటి నాయకుడు ఉండాల్సింది జైలులో కాదు, ప్రజల మధ్య. దేవుడు జగనన్నను కరుణించి త్వరగా నిర్దోషిగా బయటకు తీసుకురావాలని భగవంతుడిని ప్రార్థిస్తూ...

- జీడిమట్ల లెనిన్‌రెడ్డి, సూర్యాపేట

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...