వ్యవసాయం అంటే గుర్తొచ్చేది రైతన్నే.... చిరునవ్వు అంటే గుర్తొచ్చేది రాజన్నే... ఒక నిజమైన నాయకుడు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాడు. ప్రతీ కుటుంబం తమ కుటుంబానికి పెద్దాయన అనుకున్న రాజశేఖరరెడ్డిగారు మన నుంచి దూరమయ్యారు. ఆ తరువాత ప్రతీ కుటుంబం జగన్మోహనరెడ్డిని సిఎంగా చూడాలని కోరుకుంది. రాజన్న పథకాలు అమలుకావాలంటే జగనన్నే సమర్ధుడు... జగనన్నతోనే రాష్ట్రం మళ్లీ సమస్యశ్యామలవుతుంది. ప్రతీ కుటుంబాన్ని తన కుటుంబంగా భావించేది జగనన్న ఒక్కడే.
అందుకే అతనిని అక్కున చేర్చుకున్నారు. జగన్‌ను ప్రజల నుంచి దూరం చేయడానికి ప్రభుత్వంకీలుబొమ్మ లాంటి సీబిఐని ఎన్నుకుని దాని ద్వారా వేధిస్తున్నారు. ఎంతసేపు మీడియాను అడ్డుపెట్టుకుని అధికారం దక్కించుకున్న నాయకులకు ఉన్న గుర్తింపు రేపు ఉండదు. ప్రజల అండ ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలనుకునే నాయకుడే చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు. నీతి నిజాయితీలు లేని చంద్రబాబు చేస్తున్న కుయుక్తులు ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. ఎల్లో మీడియా సహకారంతోనే చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారు. అది ఫెయిలైనా ఆయన మీడియా సహకారంతో సక్సెస్ అని ప్రచారం చేయిస్తున్నాడు. జగన్‌ను రాజకీయంగా ఎదిరించలేక వ్యూహం పన్ని సీబిఐ అస్త్రంతో జైలుపాలు చేశారు.
జగన్‌ను నాలుగు గోడల మధ్య బంధించి పైశాచికానందం పొందుతున్నారు. కానీ ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారు. అందరి గుండెల్లో, జగనన్న చెరగని ముద్ర వేసుకున్నారు. కుట్రలు పన్ని జగనన్నను బాధించి పైశాచికానందం పొందే నాయకులు, మీడియా కనుమరుగైపోయే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. రాబోయేది రాజన్న రాజ్యం. జగనన్న మావాడు... అందరివాడు... ప్రజల ఆశీస్సులతో జగనన్న త్వరగా బయటకు రావాలని కోరుకుందాం....
- ర్యాలి సుబ్రహ్మణ్యేశ్వరి (సుభ),సిఖ్ విలేజ్, సికింద్రాబా
No comments:
Post a Comment