Saturday, November 3, 2012

అరచేతితో సూర్యుణ్ని ఆపగలరా?

ప్రజాక్షేతంలో సమస్యలపై పోరాడేవారు అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు. రాజకీయ నాయకులందరూ ప్రజల మనసులను గెలుచుకోలేరు. ప్రజల సమస్యలనే నాడిని పట్టుకుని వాటికి పరిష్కార మార్గం చూపేవారే నిజమైన ప్రజానాయకులుగా చరిత్రలో మిగిలిపోయారు. అటువంటి వారిలో వైయస్ రాజశేఖరరెడ్డి ఒకరు. ప్రజాసమస్యలను గాడిలో పెడుతున్న సమయంలో దురదృష్టవశాత్తు దివికేగిన రాజన్న స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యం.

రాజన్న మరణానంతరం చీకటి రాజ్యంగా మారిన ఆంధ్రప్రదేశ్‌లో కాంతిపుంజమై ముందుకు వచ్చాడు జగన్. రాజన్న పథకాలు మరుగున పడిపోయిన తరుణంలో పేదల పక్షాన నిలిచి అనేక పోరాటాలు, దీక్షలు చేపడుతూ ప్రజలకు ఓదార్పునిచ్చాడు. ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం పరుచుకుంటున్నాడన్న అసూయతో దుర్భుద్ధితో సీబీఐని పావులా వాడుకుని అరెస్టు చేయించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు సమాధి కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉపఎన్నికల్లో సంకేతాలు ఇచ్చారు. అయినా మాకు సిగ్గేంటి అంటూ కేసులు వాయిదాలు వేయించడం ద్వారా జగన్ రాకకు అడ్డుపుల్లలు వేసే ప్రయత్నాలు చేస్తూనే ఉంది సీబీఐ.

ప్రపంచంలో అనేకదేశాలలో ప్రజల సంక్షేమం, హక్కులకోసం పోరాడిన నాయకులను చీకటిప్రభుత్వాలు జైళ్లలో మగ్గేట్టు చేశాయి అయినా ఆ నేతలు ప్రజాబలంతో జైళ్ల గోడలను బద్దలు కొట్టుకుని వచ్చారు. అరచేతితో సూర్యకాంతిని ఆపాలనుకోవడం ఎంత అవివేకమో అప్పటి ప్రభుత్వాలకు తెలిసివచ్చాయి. జగనన్నను ఉంచిన చంచల్‌గూడ జైలులో తరచూ పవర్ కట్ చేయడం, అధికారులను మార్చడం ద్వారా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కానీ ప్రజల హృదయాల్లో ఆయన పట్ల గల ఆదరణను ఎవ్వరూ ఆపలేరు. జైల్లో జగన్‌ను నిర్బంధించాలనుకోవడం వారి వేలుతో వారి కంటినే పొడుచుకోవడం లాంటిదే. న్యాయస్థానాల్లో న్యాయం లభిస్తుంది. జగన్‌మోహన్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు రావడం సాధ్యం.
- తాడి సూర్యనారాయణరెడ్డి,
మాచవరం, రాయవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...