నేను ఒక రిటైర్డ్ ఉద్యోగిని. నాకు మొదటి నుంచి వైయస్‌ఆర్ అంటే ఎంతో అభిమానం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను
రెండుసార్లు అధికారంలోకి తీసుకుని వచ్చిన మహానుభావుడాయన. 2009లో కేంద్రంలో 33 మంది ఎంపీలను అందించిన సవ్యసాచి వైఎస్. అలాంటి వ్యక్తి కుటుంబానికి ఇటువంటి బాధలు రావడం నా మనసుకు ఎంతో బాధగా ఉంది. జగన్ తెలివితేటలతో, అతనికున్న వ్యాపారాలతో అభివృద్ధి చెందాడు. దానికే ఇంత అన్యాయమా? అదే కాంగ్రెస్‌తో కలిసి ఉంటే ఏదీ ఉండేది కాదు. సోనియా అల్లుడికి ఒక నీతి, జగన్‌కు ఒక నీతా? నేను రోజూ టీవీ ముందు కూర్చుని జగన్ గురించి ఏ వార్త వస్తుందో అని ఎదురు చూస్తున్నాను. దేనినైనా వదులుకోవచ్చు కానీ, మనోధైర్యాన్ని వదులుకోకూడదు. చివరకు విజయం జగన్‌నే వరిస్తుంది. జగన్ కుటుంబమంతటికీ మంచి జరగాలని ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తున్నాను.
- వి.పూర్ణచంద్రరావు, మాచవరం డౌన్, విజయవాడ.
No comments:
Post a Comment