Sunday, November 4, 2012

‘అన్న’మాట కోసం...

అన్న మాట కోసం... జగనన్న మాట కోసం
రాజన్న బాట పట్టిన ఓ చెల్లెమ్మా....
జనం బలం మనవెంటే చూడమ్మా

అడుగులోన అడుగేసి...
రాజన్నను తలబోసి
బడుగు బతుకు దారంటా నడవమ్మా
జనంలోన జగనన్నను చూడమ్మా
జరుగుతున్న కుట్రలెన్న
దగాకోరు నటనలెన్నో
బట్టబయలు చేయాలి చెల్లెమ్మా
ఆటకట్టు కావాలి పదవమ్మా

మసకబారిన సంక్షేమం...
ముసురుకున్న పేదరికం
నిలువెల్లా నలిపేస్తుంటే...
ఉసురులన్ని తీసేస్తుంటే
సర్కారు ఎక్కడుందో అడిగేయి చెల్లెమ్మా...
ఈ దగాకోరు పెద్దోళ్లను కడిగేయి చెల్లెమ్మా

పెద్దాయన పాలన కనిపించదు నేడిక్కడ
మొద్దునిద్ర సర్కారు జోగుతోంది ఇక్కడ
జగనన్నే రావాలి రాజన్నగా నిలవాలి
అంటున్నది ప్రతి గుండె చప్పుడు
ఆమాటే డప్పుగా మోగించు ఇప్పుడు

అన్న మాట కోసం... జగనన్న మాట కోసం
రాజన్న బాట పట్టిన ఓ చెల్లెమ్మా....
జనం బలం మనవెంటే చూడమ్మా
- రామదుర్గం మధుసూదనరావు

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...