Saturday, November 17, 2012

రండి రండి కదలిరండి

రండి రండి కదలిరండి కలసిరండి
ఫిరంగులై సివంగులై తరంగాలై తురంగాలై
‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకి
షర్మిలమ్మకు తోడుగా విజయమ్మకు నీడగా
జగనన్నకు అండగా రాజన్న దండులా
॥రండి రండి॥

దగాపడ్డ రైతుల్లారా వీధినపడ్డ విద్యార్థుల్లారా
అక్కల్లారా అన్నల్లారా అవ్వల్లారా అయ్యల్లారా
మనమంతా ఒకటేనని మనసంతా ‘జగనే’నని
కరమెత్తి గళమెత్తి ఎలుగెత్తి చాటడానికి
॥రండి రండి॥

మంచికి ముగింపు లేదని ప్రేమకు పాడె కట్టలేరని
అభిమానం అంగడి సరుకు కాదని నిజాయితీకి నిప్పుపెట్టలేరని
జగనన్న ఏ తప్పూ చేయలేదని 
జగమంత నాయకుడు జగనని
కరమెత్తి గళమెత్తి ఎలుగెత్తి చాటడానికి

॥రండి రండి॥
మండుతున్న గుండెలకు ఓదార్పునిచ్చిన నేతకు
కొండంత ప్రేమను పంచిన అమృతమూర్తికి
కన్నీళ్ళు కష్టాలు నష్టాలు అశాశ్వతం
రాముడు అరణ్యవాసం చేసినా
జీసస్‌ని శిలువ వేసినా
జనం మదిలో నిలిచింది ‘దేవుళ్ళు’గానే
అటువంటి దేవుడు మా జగనన్న అని
కరమెత్తి గళమెత్తి ఎలుగెత్త చాటడానికి
॥రండి రండి॥
- ఎం. శ్రీనివాసరావు, వల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లా

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...