వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర గురువారం తెలంగాణలోకి ప్రవేశించనుంది. గురువారం ఉదయం కర్నూలు నుంచి తుంగభద్ర బ్రిడ్జి మీదుగా మహబూబ్‌నగర్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించనుందని, మధ్యాహ్నం ఒంటి గంటకు జిల్లా సరిహద్దులోని పుల్లూరులో బహిరంగ సమావేశం ఉంటుందని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు.
యాత్రలో ప్రజలు తమ సమస్యలు షర్మిలకు తెలియజేయాలని, గ్రామాల్లో పూలు చల్లడం వంటి ఆడంబరాలకు దూరంగా ఉండాలని వారు విజ్ఞప్తి చేశారు. విగ్రహాల ఆవిష్కరణ, పతాకావిష్కరణ, కార్యాలయాల ప్రారంభోత్సవాలు, ప్రార్థనా మందిరాలకు ఆహ్వానించడం లాంటి కార్యక్రమాలు వద్దని సీజీసీ సభ్యుడు, జిల్లా సమన్వయ కమిటీ సభ్యుడు కేకే మహేందర్‌రెడ్డి సూచించారు. |
Wednesday, November 21, 2012
నేటి నుంచి తెలంగాణలో షర్మిల పాదయాత్ర
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment