జగనన్న వదలిన ఓ బాణమా
జనం గొంతు నినదించిన నాదమా
కదలిరా... కదలిరా... ఉప్పెనలా ఎగసిరా
ఉప్పులేదు పప్పులేదు రాజేయ నిప్పులేదు
అప్పులేదు దిక్కులేదు ముప్పు మాకు తప్పలేదు
రాజన్నా మా కష్టం చూడన్నా
జగనన్నా మా గోడు తీర్చన్నా
అంటున్నా పేదలకై తరలిరా బంధువువై...
బాబుగారి హామీలకు హద్దులే లేవు
నంగనాచి మాటలకు తక్కువేం లేదు
కాంగిరేసు పాలనలో తీరవిక కష్టాలు
కంటనీరు తుడవాలి... బతుకు దారి చూపాలని
వేదనతో రోదనతో వేడుకొనే పేదలకు
మేమున్నామంటూ కదలిరా చెల్లెమ్మా...
చుక్కలంటే ధరలు దిగిరావాలంటూ
రాజన్న రాజ్యం రావాలంటూ
దురన్యాయాలను తుదముట్టింప
ధర్మయుద్ధం సాగిద్దాం పదమ్మా
మన సత్తా చూపిద్దాం నడవమ్మా...
- రామదుర్గం మధుసూదనరావు
No comments:
Post a Comment